94.98%
ప్రజలు అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు, అమరావతిని ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారు.
ప్రజలు ఏమి చెబుతున్నారు

ఎందుకు అమరావతి?
అమరావతి ప్రజా రాజధాని. రాష్ట్రంలోని ప్రజలందరికి సమాన అవకాశాలు కలిపించే భవిష్యత్ రాజధానిగా అమరావతి నిర్మించబడుతుంది. ప్రపంచ అత్యాధునిక రాజధానులలో అమరావతి ఒకటి. నవ్యాంధ్రాను సస్యశ్యామలం చెయ్యాలనే లక్ష్యంతో రాష్ట్ర నడి బొడ్డున, అన్ని వనరులతో స్వయం సమృద్ధిగా రూపొందించబడుతున్న నగరం మన అమరావతి.
అమరావతి అనే పేరు గొప్ప చరిత్రతో ముడిపడి ఉంది. ఎందుకంటే ఇది శాతవాహనుల రాజధాని. కృష్ణానది ఒడ్డున ఉన్న అమరావతి మూలాలు ప్రాచీన భారత చరిత్రలో ఇమిడి ఉన్నాయి. చాలా కాలం నుండి అమరావతి ప్రాంతం దేవతల ఆవాసంగా నిలిచింది. శివుని నుండి బుద్ధభగవానుని వరకు ఈ ప్రాంతం నూతన ఆరంభాలు మరియు శుభకార్యాలు జరిగే పుణ్య భూమిగా నిలిచింది. మన ఘనమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతిబింబించే రాజధాని ని ఏపీ ప్రజలు అర్హులు గా చేసుకోవడం సముచితం.
అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రబిందువు. అమరావతి రాష్ట్రానికే కాకుండా దేశానికి అభివృద్ధి కేంద్రంగా చెయ్యాలనే భవిష్యత్తు లక్ష్యంతో, మూడు మెగా సిటీలు, పద్నాలుగు స్మార్ట్ సిటీలతో మన దేశంలోనే మన రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా రూపొందించబడుతుంది.
వినూత్నమైన ల్యాండ్ పూలింగ్ పథకంతో 26,839 మంది రైతులు చేతులు కలిపి తమ కర్మభూమిని త్యాగం చేసారు, ఇది ఇప్పటి వరకు అత్యంత స్వావలంబన కలిగిన నగరాల్లో ఒకటిగా మిగిలిపోయింది. రాబోయే కొన్ని దశాబ్దాల్లో 35లక్షల జనాభాకి ఆవాసంగా మరియు 15 లక్షల ఉద్యోగ అవకాశాలకోసం ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చెందనున్న ఒక రాజధాని నగరం, సంపన్నమైన మరియు సంతోషకరమైన నవ్యాంధ్రను సృష్టిస్తుంది. ప్రతి తెలుగు పౌరుడు గర్వించదగ్గ భవిష్యత్తు కళ మరియు రేపటి తరం యొక్క చరిత్ర, నాడు అమరావతి రైతుల త్యాగఫలం మన అమరావతి.!